ఈరోజు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ రెండో
సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోన ఉధృతి కారణంగా ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలను
రద్దు చేశారు. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం
మార్కుల ఆధారంగా రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఆయా
సబ్జెక్టులలో వచ్చిన మార్కులనే రెండో సంవత్సరంలో కూడా
ఇవ్వనున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా బ్యాక్లాగ్ ఉన్నా 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు పూర్తి మార్కులను కేటాయిస్తారు. ఎవరైనా
విద్యార్థులు ఈ ఫలితాల పట్ల తృప్తి చెందకపోతే కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత వారి కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని
ఇంటర్మీడియట్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ రెండో
సంవత్సరం ఫలితాలకోసం: www.tsbie.cgg.gov.in వెబ్సైట్,
మరియు వివిద ఆన్లైన్ వార్తాపత్రికలలో చూడవచ్చు.