
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న నివాస భూములపై వేకెంట్
ల్యాండ్ టాక్స్ విధించాలని రాష్ట్ర పురపాలకశాఖ నిర్ణయించింది. వ్యక్తులు ఇళ్ళు కట్టుకొనేందుకు
కొనుగోలు చేసిన స్థలాలు, అనుమతి పొందిన లేఅవుట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా
క్రమబద్దీకరణ చేయబడిన ఫ్లాట్లపై కూడా వేకెంట్ ల్యాండ్ టాక్స్ విధించబోతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ విలువలో 0.05
శాతం నుంచి 0.20 శాతం వరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు
ఈ ప్రతిపాదనను పాలకమండలి సమావేశంలో పెట్టి ఆమోదం పొందాలని రాష్ట్ర పురపాలకశాఖ ఆదేశించింది.
బహుశః మరో ఒకటి రెండు నెలల్లోగా వేకెంట్ ల్యాండ్ టాక్స్ అమలులోకి రావచ్చు.