
కరీంనగర్ లో త్వరలోనే కేబుల్ బ్రిడ్జిను ప్రారంభించుటకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. కేబుల్ బ్రిడ్జి ద్వారా కరీంనగర్-వరంగల్ మధ్య దూరం తగ్గనుంది. కేబుల్ బ్రిడ్జిని రూ.149 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. తాజాగా తీగల వంతెనపై రవాణా శాఖ అధికారులు సామర్థ్య పరీక్షలు నిర్వహించి పరిశీలించారు. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ చొరవతో ఈ తీగలవంతెనకు డిజిటల్ లైట్లతో వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తయితే తీగల వంతెన పనులు దాదాపు పూర్తి అయినట్లే అని రవాణాశాఖ అధికారులు చెప్పారు.