
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. గత ఎన్నికలలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసినప్పటి నుండి నిన్నటి వరకు ఏఐసీసీ అధ్యక్షుడిని ప్రకటించలేదు. టీ పీసీసీ అధ్యక్షుడిగా పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ చివరకు రేవంత్ రెడ్డి నియమించింది. ఆయనతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఉపాధ్యక్షుడు లను కూడా నియమించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్: బీ మహేష్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ గౌడ్, టీ జగ్గారెడ్డి, డాక్టర్ జె.గీతారెడ్డి నియమించింది.
సీనియర్ ఉపాధ్యక్షులు: జావేద్ అమీర్, గోపిశెట్టి నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, ఉదయం వీరయ్య, సురేష్ షెట్కార్ ను నియమించింది.