ఆధార్, పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్ కార్డ్, ఆధార్ కార్డు అనుసంధానించే గడువు పొడిగించింది.  నేటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాపించి ఉన్నందున సెప్టెంబర్ 30 వరకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగానే గత ఏడాది మార్చి 31 నుండి ఈనెల 30 వరకూ పలుమార్లు గడువు పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు పొడిగించింది.