డిస్కవరీ ఛానల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంటరీ

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చిత్ర పఠాన్నిసమూలంగా మార్చివేసిన ఏకైక ప్రాజెక్టు...కేవలం మూడేళ్లలో కళ్ల ముందు సాక్షాత్కరించిన ఇంజనీరింగ్ మహాద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎంతగా ప్రసిద్ధి చెందింది అంటే ఈనెల 25వ తేదీ రాత్రి 8 గంటలకు దీనిపై డిస్కవరీ ఛానల్‌ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. దేశానికే గర్వకారణంగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ రాష్ట్రంలో నివశిస్తున్నవారు. దేశవిదేశాలలో నివశిస్తున్న తెలంగాణ ప్రజలు ఈ ప్రాజెక్టును ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు దాని గొప్పదనం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కనుక 25వ తేదీ రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కాబోతున్న డాక్యుమెంటరీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు చూడవచ్చు.