మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఎన్నికల కమీషన్ జలక్

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఎన్నికల కమీషన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చులను ఇంతవరకు సమర్పించకపోవడంతో మూడు సంవత్సరాల వరకు ఏ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు బుదవారం ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక్ గోయల్ మీడియాకు తెలిపారు.