సిఎం బయటికొస్తే ప్రతిపక్షనేతలను లోపలేస్తారా?విజయశాంతి

బిజెపి మహిళా నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు వస్తే జిల్లాలలోని ప్రజలను రోడ్లపైకి రాకుండా అడ్డుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడం, ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందుగానే నిర్బందిస్తుండటాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రజలను, ప్రతిపక్షాలను ఈవిదంగా హింస పెట్టే బదులు సిఎం కేసీఆర్‌ ఫాంహౌసులో ఉండటమే మంచిదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా సిఎం కేసీఆర్‌ మోసపూరిత వాగ్ధానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వాటిని అమలుచేయరని, కనుక ఆయన పర్యటనల వల్ల జిల్లాలకు ఒరిగేదేమీ ఉండదని ఆరోపించారు.సిఎం కేసీఆర్‌కు హుజూరాబాద్‌లో పర్యటించే ధైర్యం లేకనే సిద్ధిపేట, వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల పేరుతో ప్రాచారార్భాటం తప్ప వాటితో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని విజయశాంతి అన్నారు.