తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత

తెలంగాణ ప్రజలకు ఓ శుభవార్త. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలియజేసింది. ప్రస్తుతం సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకోగానే ఆ విషయం సీఎంఓ ట్వీట్ ద్వారా ప్రకటించడం విశేషం. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు  సీఎంఓ ట్వీట్ ద్వారా తెలియజేసింది. కనుక రేపు అంటే ఆదివారం నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు యధేచ్చగా బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చక్కబెట్టుకోవచ్చు.