
సిఎం కేసీఆర్ ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామ పర్యటనకు వెళ్ళనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జనగామ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో వాసాలమర్రిలో ఆగి గ్రామ పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అప్పుడే ఆ గ్రామాన్ని దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించి గ్రామంలో మౌలికవసతులు కల్పించి అభివృద్ధి చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామం పరిస్థితి ఏవిదంగా ఉందో స్వయంగా పరిశీలించేందుకు సిఎం కేసీఆర్ 22న అక్కడికి వెళ్ళబోతున్నారు. సిఎం కేసీఆర్ పర్యటన ఖరారు అవడంతో జిల్లా కలెక్టర్ పమెలా సత్పత్తి ఆ గ్రామానికి వెళ్ళి అభివృద్ధి పనులను పరిశీలించి సిఎం కేసీఆర్ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయిస్తున్నారు.