సంబంధిత వార్తలు

కేంద్రప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకొంది. దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న కారణంగా గడువు పూర్తయిన డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, వాహన ఫిట్‌మెంట్ సర్టిఫికేట్స్ వగైరాలను సెప్టెంబర్ 30వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది దేశంలో కరోనా ప్రవేశించినప్పుడు కూడా ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన వాహనాలకు మూడు నెలలు పొడిగించింది. మళ్ళీ ఈ ఏడాది కూడా కరోనా వల్లనే మూడు నెలలు గడువు పొడిగించింది.