
తెలంగాణ రాజకీయాలలో వైఎస్సార్ తెలంగాణ పార్టీతో ప్రవేశించబోతున్న వైఎస్ షర్మిలకు పార్టీని ప్రకటించకమునుపే తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ నిర్మాణం కోసం జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన అడ్హక్ కమిటీలలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొందరు చెంచాగాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొందరు వైఎస్సార్ అభిమానులు రాజీనామాలు చేశారు. అడ్హక్ కమిటీలలో చోటు లభించనందుకు మరికొందరు రాజీనామాలు చేశారు. అయితే రాజకీయ పార్టీలలో ఇటువంటి భిన్నాభిప్రాయాలు మామూలేనని త్వరలోనే అన్ని సర్దుకొంటాయని, వైఎస్ షర్మిల నేతృత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని హైదరాబాద్లోని ఆ పార్టీ ప్రతినిధులు చెపుతున్నారు.