టిఆర్ఎస్‌ ఎంపీ నామాకు ఈడీ సమన్లు

ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు బ్యాంకు రుణాల మళ్లింపు ఆరోపణలపై ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. ఆయనతోపాటు మధుకాన్ గ్రూప్  డైరెక్టర్లకు కూడా సమన్లు పంపింది. ఈనెల 25వ తేదీన అందరూ విచారణకు హాజరుకావాలని ఈడి సమన్లలో తెలిపింది. గత రెండురోజుల పాటు ఈడి బృందాలు మధుకాన్ సంస్థ కార్యాలయం, ఆ గ్రూప్ డైరెక్టర్ ఇండ్లలో జరిపిన సోదాల్లో భారీగా నగదు డబ్బు, ఇతర దస్త్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనపరచుకున్నాయి. నామాకు చెందిన మధుకాన్ సంస్థ రాంచీలో జాతీయ రహాదారి నిర్మాణం కోసం రాంచి ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వివిధ బ్యాంకుల నుండి రుణాలను తీసుకొని ఆ నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలపై ఈడీ సోదాలు జరిపి సమన్లు జారీ చేసింది.