
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి కొందరిపై ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసును నాంపల్లి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలతో శ్రీనివాస్ యాదవ్, తెరాస ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, రాజేశ్వరరావు, అప్పటి మోండామార్కెట్ కార్పొరేటర్ ఏ.రూప తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ కేసుకు సంబందించి అభియోగ పత్రాలు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సరైన సాక్ష్యాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది.