నేడు ఉపసంఘంతో మంత్రి గంగుల భేటీ

సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటీ కానుంది . కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు, జనాభా ప్రాతిపదికన కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటు, ప్రజలకు సులువుగా  రేషన్ సరుకులను అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.