జూన్‌ 19 నుండి సిఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

సిఎం కేసీఆర్‌ శుక్రవారం పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై ప్రగతి భవన్‌లో సంబందిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినందున ఈబేల 19వ తేదీ తరువాత జిల్లాలలో పర్యటించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు అమలవుతున్న తీరు, పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. వర్షాకాలం వచ్చినందున సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉండాలని అన్నారు.