
శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న నల్గొండ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తప్పటడుగులు వేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. “ఈటల రాజేందర్‌కు సిఎం కేసీఆర్ పార్టీలో, ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆయన తన రాజకీయ భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకొన్నారు. రాజకీయాలలో హత్యలు ఉండవు...ఆత్మహత్యలే ఉంటాయని ఈటల రాజేందర్ మరోసారి నిరూపిస్తున్నారు. ఇప్పటికీ ఆయన రాజకీయంగా ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన బిజెపిలో చేరుతున్నారని భావిస్తున్నాను. అందరికీ తెలిసిన అనేక కారణాలతో దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోతోంది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరినా ఉపఎన్నికలలో ఓడిపోవడం ఖాయం. మరో 20 ఏళ్ళ వరకు రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో కొనసాగుతుంది,” అని అన్నారు.