ఈటల బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 14న బిజెపిలో చేరబోతున్నారు. ఈవిషయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇవాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈనెల 14న ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్‌ మాజీ జెడ్పీ ఛైర్మ పర్సన్‌ తుల ఉమా ముగ్గురూ ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయకండువాలు కప్పుకోనున్నారు. కనుక ఆలోగానే స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించవచ్చు.