త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు?

ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరుగనుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరుగబోయే ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖతో సహా సంబందిత శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు జారీ... వాటికి విధివిధానాలు, రేషన్ డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయడం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారికి వెంటనే మంజూరు చేయాలని ఆదేశించిన నేపధ్యంలో ఈ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరుగబోతోంది. కనుక త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి.