వీణవంకలో పలువురు టిఆర్ఎస్‌ నేతలు రాజీనామా

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వీణవంక మండలానికి చెందిన పలువురు టిఆర్ఎస్‌ నేతలు పార్టీని వీడారు. మండల అధ్యక్షుడు మారముల్ల కొంరయ్య, మండలంలోని పీఏసీఎస్‌ వైస్‌-చైర్మన్‌, డైరెక్టర్లు, 12 గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఏడు గ్రామాల సర్పంచ్‌లు, పలువురు టిఆర్ఎస్‌ కార్యకర్తలు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మారముల్ల కొంరయ్య మాట్లాడుతూ తామందరం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.