2.jpg)
తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్రావు శనివారం ఉదయం సిద్ధిపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్లో వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వ కరోనా వ్యాక్సిన్ విధానం లోపభూయిష్టంగా ఉంది. కనీసం సరైన నిర్ణయాలు తీసుకోలేక కేంద్రం తడబడుతోంది. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్లు సరఫరా చేయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉంది కానీ చేయలేకపోతోంది. హైదరాబాద్లోనే కోవాక్సిన్లు తయారవుతున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలనుకొన్నప్పటికీ కేంద్రం విధించిన ఆంక్షల వలన లభించడం లేదు. పోనీ విదేశాల నుంచి వాక్సిన్లు దిగుమతి చేసుకొందామంటే కేంద్రప్రభుత్వం సహకరించడం లేదు. వాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం తీసుకొంటున్న తప్పుడు, అనాలోచిత నిర్ణయాల వలన దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైగా రాష్ట్రాలలోని బిజెపి నేతలు కేంద్రాన్ని వెనకేసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు. కరోనా మూడోసారి కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు వినబడుతున్నవేళ, వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.