ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీపై రాములమ్మ ఆగ్రహం

రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వాదేశాలను పట్టించుకోకుండా కరోనా చికిత్స పేరిట ప్రజలను నిలువునా దోచుకొంటున్నా తెలంగాణ ప్రభుత్వం వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బిజెపి మహిళా నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్స కోసం ప్రజలు తమ ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడుతున్నారని, ఈవిషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా చలనం కలగడంలేదని ఆక్షేపించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీస్తూ ఆమె వరుసగా ట్వీట్స్ చేశారు. అవి ఆమె మాటల్లోనే...