సంబంధిత వార్తలు
తెలంగాణ రాష్ట్రంలో ‘రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ’ వైఎస్ షర్మిల చాలా నాటకీయంగా రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నాలలో భాగంగా ఆమె కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఆమె పెట్టబోయే పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ. దీనికి కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలుపడదు కనుక లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ఆమె బహిరంగ సభ ఏర్పాటు చేసి తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారు.