2.jpg)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ప్రెస్మీట్ పెట్టి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తరువాత తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పంపించి శనివారం లేదా ఆదివారం బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం.
ఈటల రాజేందర్ బిజెపి పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడే ఆయన ఆ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టమైంది. కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, బిజెపిలో చేరడం ఊహించినదే. కానీ బిజెపిలో చేరిన తరువాత ఆయన టిఆర్ఎస్లోని అసంతృప్త నేతలను, ఎమ్మెల్యేలను ఏ మేరకు ఆకర్షించి బిజెపిలోకి రప్పించగలరనేది ఆసక్తికరమైన విషయం లేకుంటే సిఎం కేసీఆర్ను విమర్శిస్తూ బిజెపిలో కాలక్షేపం చేస్తున్న డికె.అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ వంటి నేతల జాబితాలో ఈటల రాజేందర్ కూడా ఒకరిగా మిగిలిపోతారు.