
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ల రెండేళ్ల ఎమ్మెల్సీ పదవీకాలం నేటితో ముగియనుంది. వారిలో గుత్తా 2019 ఆగస్టులో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి సెప్టెంబర్ 11వ తేదీన మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సుమారు 21 నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. మళ్ళీ మరోసారి తనకు తప్పకుండా అవకాశం లభిస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశిస్తున్నారు.
నేతి విద్యాసాగర్ 2015 జూన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. ఆయనకు మళ్ళీ రెండోసారి మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మొత్తం తొమ్మిదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. నేటితో ఇరువురి పదవీకాలం ముగియనుంది. కానీ కరోనా కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం ముందే చెప్పేసింది.