నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇవాళ్ళ తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్‌ గన్‌పార్క్‌ వద్దకు వెళ్ళి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్‌ చేరుకొని జాతీయజెండాను ఎగురవేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సిఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి వారి నియోజకవర్గాలలో జాతీయజెండా ఎగురవేసి నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.