అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులపై నిషేధం కొనసాగింపు

తెలంగాణలో మరో పది రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించినందున టీఎస్‌ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతర్ జిల్లా సర్వీసులు తిరుగుతాయి. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచే లాక్‌డౌన్‌ మొదలవుతుంది కనుక ఆ తరువాత గమ్యస్థానాలు చేరుకొన్న ప్రయాణికులు పోలీసులకు తమ టికెట్స్‌ చూపించి ఇళ్లకు చేరుకోవచ్చు. సిటీ బస్సులు మధ్యాహ్నం 12.30 గంటలకే డిపోలకు చేరుకొంటాయి.