1.jpg)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షా తదితరులతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బిజెపి నేత వివేక్ కూడా ఢిల్లీ వెళ్ళారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకొంటారు. ఆయన ఈటల రాజేందర్‌ను తోడ్కొని రేపు ఉదయం తమ పార్టీ పెద్దల వద్దకు తీసుకువెళతారు. రేపు జరుగబోయే భేటీలో పార్టీలో ఆయనకు ఎటువంటి స్థానం లభిస్తుంది?రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఏవిదంగా ముందుకు సాగాలి?వంటి పలు అంశాలపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపి అధిష్టానం ఇచ్చే హామీలు, మార్గదర్శకాలతో ఈటల రాజేందర్ సంతృప్తి చెందినట్లయితే జూన్ 2వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జూన్‌కు 6వ తేదీన మళ్ళీ ఢిల్లీ వచ్చి బిజెపి పెద్దల సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.