తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణలో లాక్‌డౌన్‌ మరో పది రోజులు పొడిగించబడింది. అయితే ఉదయం 10 గంటలకు బదులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లాక్‌డౌన్‌ మొదలవుతుంది. కనుక రేపటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే మరో 3 గంటలు లాక్‌డౌన్‌ సడలించినట్లయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే లాక్‌డౌన్‌ మొదలవుతున్నప్పటికీ ఆ తరువాత మరో గంట సేపు ప్రజలు ఇళ్ళు చేరుకొనేందుకు పోలీసులు అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు  కటినంగా అమలుచేస్తారు.

 ప్రభుత్వోద్యోగులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, మెడికల్ షాప్స్, ఆక్సిజన్‌ సరఫరా తదితర అత్యవసర సేవలకు లాక్‌డౌన్‌ నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర పనులపై బయటకు వెళ్ళవలసినవారు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవలసి ఉంటుంది.