డిసెంబర్‌ 31లోగా తెలంగాణలో అందరికీ టీకాలు: కేటీఆర్‌

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం వేములవాడ పరిధిలోని తిప్పాపూర్‌లో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో రెండు కంపెనీలు      ఉత్పత్తి చేస్తున్న టీకాలలో 85 శాతం కేంద్రప్రభుత్వానికి వెళ్లిపోతున్నాయి. మిగిలినవాటిని అవి ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకొంటున్నాయి. కనుక విదేశాల నుంచి వాక్సిన్లు తెప్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలిచాము. మా ప్రయత్నాలు ఫలిస్తే ఈ డిసెంబర్‌ నెలాఖరులోగా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ కరోనా టీకాలు వేయగలమని భావిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వలన రాష్ట్రంలో కరోనా తీవ్రఠ క్రమంగా తగ్గుతోంది. మున్ముందు మళ్ళీ కరోనా వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉన్నాము,” అని చెప్పారు.