
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా కరోనా టీకాలు వేసే కార్యక్రమం నత్త నడకలు నడుస్తోంది. ఈ సమస్యపై గుజరాత్ హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు, దానికి ప్రభుత్వం తరపు వాదిస్తున్న అటార్నీ జనరల్ చెప్పిన సమాధానం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో 18-45 ఏళ్ళ వారికి టీకాలు వేసేందుకు 6.5 కోట్లు డోసులు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల డోసులకు ఆర్డర్ పెట్టిందని అటార్నీ జనరల్ తెలిపారు. కానీ రోజుకి సుమారు 1-2 లక్షల డోసులు చొప్పున నెలకు 30-60 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేయగలమని ఆ రెండు కంపెనీలు తెలిపాయని చెప్పారు.
“రాష్ట్రంలో కోట్ల మంది టీకాల కోసం ఎదురుచూస్తుంటే లక్షల సంఖ్యలో టీకాలు వేస్తున్నారు. ఈ లెక్కన టీకాలు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచవర్ష ప్రణాళిక ఏమైనా రూపొందించుకొందా?” అని హైకోర్టు ప్రశ్నించింది.