
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమ్మెపై సిఎం కేసీఆర్ సున్నితంగా స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈరోజు ప్రగతి భవన్‌లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సిఎం కేసీఆర్, “రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో జూ.డాక్టర్లు సమ్మె చేయడం సరికాదు. దీనిని ప్రజలు కూడా హర్షించరు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. కనుక తక్షణం సమ్మె విరమించి విధులలో చేరవలసిందిగా కోరుతున్నాను,” అని చెప్పారు.
ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనం 15 శాతం పెంచాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.