.jpg)
ఈనెల 30 వరకు తెలంగాణలో లాక్డౌన్ విధించడంతో రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా పాజిటివ్ కేసులు 5 శాతం కంటే దిగువకు వస్తే తప్ప రాష్ట్రంలో కరోనా పూర్తిగా కట్టడిలో ఉన్నట్లు భావించరాదని సిఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రాష్ట్రంలో మరింత కటినంగా లాక్డౌన్ ఆంక్షలు అమలుచేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. లాక్డౌన్తో రాష్ట్ర ఆదాయం కోల్పోతునప్పటికీ కరోనాను పూర్తిగా కట్టడి చేయడం చాలా ముఖ్యమని సిఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రాష్ట్రంలో లాక్డౌన్ మరో వారం పది రోజులు పొడిగించే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నప్పటికీ లాక్డౌన్ యధాతధంగా కొనసాగిస్తూ నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించవచ్చు.