సంబంధిత వార్తలు

వరంగల్ సెంట్రల్ జైలును కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలనే ప్రతిపాదన మళ్ళీ అటకెక్కింది. ఈరోజు సిఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా రోగులను పరామర్శించి అక్కడి వైద్యులు సిబ్బందితో మాట్లాడిన తరువాత సెంట్రల్ జైలును సందర్శించి స్వయంగా పరిశీలించారు. ఆ జైలు ఆసుపత్రిగా మార్చేందుకు అనుకూలంగా లేదని భావించిన సిఎం కేసీఆర్ దానిని మాతాశిశు సంరక్షణా కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. నగర శివార్లలో ఓపెన్ ఎయిర్ జైలు నిర్మించి ఆ జైలును అక్కడికి తరలించాలని నిర్ణయించారు. ఎంజీఎం ఆసుపత్రినే మరింత విస్తరించి సకల సదుపాయాలతో సూపర్ స్పెషల్ హాస్పిటల్‌గా మార్చుతామని సిఎం కేసీఆర్ తెలిపారు.