సిఎం కేసీఆర్‌ నేడు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి పర్యటన

సిఎం కేసీఆర్‌ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. సిఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన వివరాలు: 

• ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకొంటారు.   

• అక్కడి నుంచి నేరుగా టిఆర్ఎస్‌ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఇంటికి వెళతారు. 

• తరువాత 11.45 గంటలకు వరంగల్‌ సెంట్రల్ జైలుకి వెళతారు. సువిశాలమైన స్థలంలో నగరం మద్యన ఉన్న సెంట్రల్ జైలును కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో దానిని పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇస్తారు. 

• మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీఎం ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శిస్తారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. 

• తరువాత మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమీషనర్, ఆసుపత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 

• సాయంత్రం 4 గంటలకు హన్మకొండ నుంచి హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు.