సంబంధిత వార్తలు

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పగటిపూట కూడా లాక్డౌన్ విధించడంతో సొంత వాహనాలు ఉన్నప్పటికీ అత్యవసర పనులపై బయటకు వెళ్ళడం చాలా కష్టం అవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇతర జిల్లాలకు వెళ్ళాల్సినవారు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకొనేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పోలీస్ శాఖ ఈ-పాస్ జారీ చేయాలని నిర్ణయించామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ-పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ-పాస్ ఉన్నట్లయితే లాక్డౌన్ సమయంలో అత్యవసరపనులపై బయటకు వెళ్ళవచ్చు.