లాక్‌డౌన్‌ సమయంలో వీటికి మినహాయింపు

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ అమలవుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబందించి మార్గదర్శకాలు జారీ చేసింది. 

లాక్‌డౌన్‌ సమయంలో వీటన్నిటికీ మినహాయింపు:  

• అత్యవసర సేవలు: ప్రభుత్వ, ప్రైవేట్ దవఖానాలు, మందుల దుకాణాలు, అంబులెన్సులు, మందుల కంపెనీలు, వైద్యులు, వైద్య సిబ్బంది, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లకి.    

• జాతీయ రహదారులపై సరుకు రవాణా, గ్రామాలలో ఉపాధి హామీ పనులు, ధాన్యం సేకరణ, అమ్మకాలకి.  

• కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు, ఏటీఎంలు, గ్యాస్ ఏజన్సీలు వగైరా

• ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి. 

• ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి సరఫరా వ్యవస్థలు, వాటి అనుబంద సంస్థలు, వాటిలో పని చేసే ఉద్యోగులందరికీ. 

• అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయి.   

• పెళ్ళిళ్ళకు ముందుగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వధూవరుల రెండువైపులా కలిపి మొత్తం 40 మంది, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి అనుమతి. 

వీటికి అనుమతి లేదు: 

• మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఆమ్యూజిమెంట్ పార్కులు, జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్ వగైరా.