కరోనా కట్టడికి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం

ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమాన్యం కరోనా నియంత్రణకు విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సన్ నెట్వర్క్ టీవీ తెలిపింది. దేశంలో కరోనా నియంత్రణకు తమ వంతు సహాయంగా  రూ.30 కోట్లు విలువచేసే కరోనా చికిత్స పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను ఇవ్వనున్నట్టు సన్ టీవీ తెలిపింది. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆసుపత్రులకు అందించడం జరుగుతుందని ప్రకటించింది. అలాగే కరోనా కట్టడి, జాగ్రత్తలు, చికిత్స, వాక్సిన్లు తదితర అంశాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రణాళికలు రూపొందించామని సన్ టివి ప్రకటించింది.