అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ

అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా బిజెపి సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం గౌహతీలో సమావేశమయ్యారు. వారు తమ అధిష్టానం సూచన మేరకు హిమంత బిశ్వ శర్మను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొన్నారు. అనంతరం ఆయన గవర్నర్‌ జగదీశ్ ముఖిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దతను వ్యక్తం చేస్తూ తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. ఈనెల 15వ తేదీన హిమంత బిశ్వ శర్మ అస్సాం 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

అస్సాం శాసనసభలో మొత్తం 126 స్థానాలుండగా వాటిలో బిజెపి సొంతంగా 60 సీట్లు, దాని మిత్ర పక్షాలు మరో 15 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రంలో బిజెపి కూటమి మళ్ళీ మరోసారి అధికారంలోకి వస్తోంది.