మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్‌ మృతి

రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్‌ (82) ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ కన్నుమూశారు. అజిత్ సింగ్ గత నెల 20న కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి మరణించారని ఆయన కుమారుడు జయంతి చౌదరి  ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.