మంత్రి పువ్వాడకు కరోనా

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్‌ అని నిర్ధారణ అయిందని స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స  తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తనను కలిసిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.