
గోవాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం నుంచి మే 3 ఉదయం వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని గోవా రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. కరోనా చైన్ తెంపేందుకు ఇంతకు మించి వేరే మార్గం లేదని అన్నారు. అయితే అత్యవసర సేవలు, పారిశ్రామిక పనులు, నిత్యావసర వస్తువులకు వంటి వాటికి లాక్డౌన్లో వెసులుబాటు కల్పించినట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్యాసినోలు, పబ్లు, హోటల్స్ కూడా మూసే ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులు తమ హోటల్ గదిలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దని ప్రమోద్ సావంత్ భరోసానిచ్చారు. ప్రజా రవాణా అందుబాటులో ఉండదని తెలిపారు. అత్యవసర సరుకుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని ప్రమోద్ సావంత్ తెలిపారు.