సంబంధిత వార్తలు

హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. శ్రీలత కరోనా స్వల్ప లక్షణాలు కనబడటంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయం ఆమె స్వయంగా తెలిపి, ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.