సంబంధిత వార్తలు

భారత ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు లేదా పార్టీలు విజయోత్సవాలను జరుపుకోరాదని పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అలాగే గెలిచిన అభ్యర్థులు ధృవీకరణ పత్రం కోసం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.