రేపు టిఆర్ఎస్‌ 20వ వార్షికోత్సవం...కానీ కరోనా!

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి రేపటికి 20 సం.లు పూర్తవుతాయి. కనుక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా వేడుకలను జరుపుకోవాలనుకోవడం సహజం కానీ రాష్ట్రమంతటా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఆ ఆలోచన మానుకోకతప్పడం లేదని టిఆర్ఎస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. కానీ పార్టీ శ్రేణులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నిరాడంబరంగా వేడుకలను జరుపుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి గ్రామస్థాయి వరకు అన్ని చోట్ల రేపు గులాబీ జెండాలు రెపరెపలాడాలని అన్నారు. తద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెపుదామని పిలుపునిచ్చారు.