సంబంధిత వార్తలు

కరోనా తీవ్రత కారణంగా సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం పనివేళలో స్వల్పమార్పులు చేసినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు. పాస్‌పోర్ట్ ప్రజా విచారణ కేంద్ర సమయాన్ని ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు సమయాన్ని తగ్గించారు. అలాగే తాత్కాలిక పాస్‌పోర్ట్‌లు, పీసీసీ స్లాట్‌లు 50 శాతం తగ్గించినట్లు ఆయన తెలిపారు. అపాయింట్‌మెంట్లు మాత్రం కొనసాగుతాయని బాలయ్య తెలిపారు. అలాగే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రాలలో కూడా సల్ప మార్పులు చేశారు. ఈ మార్పులు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటాయని సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి తెలిపారు.