మన్ కీ బాత్ నై...జన్ కీ బాత్ సునోజీ

ప్రధాని నరేంద్రమోడీ అప్పుడప్పుడు ఆకాశవాణీ మద్యమం ద్వారా ‘మన్ కీ బాత్’ పేరుతో తన మనసులో ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకొంటారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆ కార్యక్రమంపై స్పందిస్తూ ట్విట్టర్‌లో ఆయనకు చిన్న చురకలు వేశారు. 

“మన దగ్గర ఎన్ని వనరులున్నాయనేది ముఖ్యం కాదు. వాటిని సరిగ్గా వినియోగించుకోవడం చేతకానప్పుడు ఎన్ని ఉన్నా సరిపోవు. మీ మన్ కీ భారత్‌ ఆపి... జన్ కీ బాత్ (జనం చెప్పేది) వినడం మొదలుపెట్టండి...” అంటూ ట్వీట్ చేశారు. 

దానితో కింద గుజరాత్‌లో నిర్మించిన సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహం... పక్కనే ఆక్సిజన్ మాస్క్ ధరించిన ఓ వృద్ధురాలు... ఆమె పక్కనే ఖాళీ ఆక్సిజన్ సిలిండర్ చిత్రాన్ని సీతక్క పోస్ట్ చేశారు.