6.jpg)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈవిషయం రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకినందున పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ట్వీట్ చేస్తున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.