అనుములలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ శ్రేణుల మద్య ఘర్షణ

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కె.జానారెడ్డి స్వగ్రామం అనుములలో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న కె.జానారెడ్డి హాలియాలో ప్రచారానికి వెళుతుండగా దారిలో టిఆర్ఎస్‌ శ్రేణులు ఎదురుపడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌ పార్టీ శ్రేణులతో కలిసి అనుములలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుపడ్డాయి. కె.జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి వారిని అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలపై స్వల్పంగా లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.