సంబంధిత వార్తలు

గత ఏడాది మార్చి నుండి అన్నిటితోపాటు ఎంఎంటిఎస్ రైళ్ళు కూడా బంద్ అయిపోయాయి. కరోనా ఉదృతి తగ్గిన తరువాత దశలవారీగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, మెట్రో రైళ్ళు, సిటీబస్సులు ప్రారంభించినప్పటికీ, ఎంఎంటిఎస్ రైళ్ళను మాత్రం ఇంతవరకు బయటకు తీయడం లేదు. ఇదేవిషయం దక్షిణమద్యరైల్వే జనరాల మేనేజర్ గజానన్ మాల్యాను అడుగగా, “ఎంఎంటిఎస్ రైళ్ళను ప్రారంభిస్తే నిత్యం వేలాదిమంది వాటిలో ప్రయాణిస్తుంటారు కనుక ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇప్పట్లో ఎంఎంటిఎస్ రైళ్ళను పునరుద్దరించే అవకాశం లేదు,” అని చెప్పారు.